‘తల్లికి వందనం’ అర్హులు వీరే – మార్గదర్శకాలు..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసి నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. మే నెలలో ఈ పథకం నిధులు జమ చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పై నిర్ణయం ;- ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్దిక సంవత్సరంలో పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. తల్లికి వందనం అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. గతంలో ఏ హామీ ఇచ్చామో.. అదే విధంగా అమలు చేస్తామని.. మే నెలలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటా యించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందన పథకం కింద బడి కి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేసారు. నిధుల కేటాయింపు :- మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాల పై కసరత్తు జరుగుతోంది. 2025-26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించగా, గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమ యం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్‌లో ఈ పథ కానికి నిధులు కేటాయింపుతో ఈ పథకం అమలు కానుంది. మార్గదర్శకాలు :-ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Related Posts

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..