స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలోఆధునిక మానవుడు సైన్స్ & టెక్నాలజీ కార్యక్రమం

మన న్యూస్ :- ఈరోజు స్వామి విద్యానికేతన్, సాయిరాం నగర్, హై స్కూల్ రోడ్, జీవీఎంసీ 67 వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల ఇండోర్ ఆడిటోరియంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో “ఆధునిక మానవుడు – సైన్స్ అండ్ టెక్నాలజీ” అనే అంశంపై “సైన్స్ ఎక్స్పో” డ్రిప్ ఇరిగేషన్, రెయిన్ వాటర్, హార్వెస్టింగ్, విండ్ మిల్, సోలార్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ హౌస్, ప్లాంట్ సెల్, ఎలక్ట్రికల్ జనరేటర్, వాల్కోన్, ఎన్విరాన్మెంటల్, సోలార్ సిస్టం, డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ ప్రాసెస్. మొదలగు ప్రధాన అంశాలపై సైన్స్ ఎక్స్పో కొనసాగింది. ఈ కార్యక్రమం విద్యార్థులతో ఏర్పాటు చేయడానికి 45 రోజులు సమయం పట్టిందని ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి తెలిపారు. ఆధునిక మానవుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సైన్స్ ఎక్స్పోకు ఎంతో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, ముఖ్యఅతిథిగా గాజువాక మండల రెవెన్యూ అధికారి శ్రీమతి తోట శ్రీవల్లి మరియు పట్టణంలోనే ఉన్నతమైన సామాజిక స్పృహ కలిగిన స్త్రీ మూర్తి, విశాఖపట్నంలో గైనకాలజీ విభాగంలో మంచి పేరు గన్న వైద్యాధికారిని, ప్రస్తుతం పెదగంట్యాడ మండలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ పి హేమలత తదితరులు సైన్స్ ఎక్స్పోకు హాజరైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా పర్యావరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు తెలియజేశారు. గాజువాక ఎమ్మార్వో శ్రీవల్లి ఆధునిక మానవుడు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 36 కోట్లు అప్పటికే వ్యవసాయం మీద ఆధారపడే జీవించే ప్రజల 90 శాతం ఉండేవారు అయినప్పటికీ చాలామంది ప్రజలు కరువుతో అలమటించి చనిపోయేవారు కానీ నేటి భారతదేశపు జనాభా 140 కోట్లు పైబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం వ్యవసాయం మీద ఆధారపడే ప్రజలు కేవలం 36.5% తగ్గినప్పటికీ ప్రస్తుతం ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఉంది వీటన్నింటికీ కారణం వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ చేసిన గ్రీన్ రివల్యూషన్ కారణంగా హైబ్రిడ్ విత్తనాలు, ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ వాడకము వలన ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరగడం అదేవిధంగా డాక్టర్ వర్గీస్ కురియన్ స్టార్ట్ చేసిన వైట్ రివల్యూషన్ కారణంగా మిల్క్ ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులోకి రావడం మరొక కారణం డాక్టర్ హీరోలాల్ చౌదరి స్టార్ట్ చేసిన బ్లూ రివల్యూషన్ వలన చేపలు రొయ్యల ఉత్పత్తి పెరిగింది అని విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ హేమలత మాట్లాడుతూ వైద్యరంగంలో వైద్య శాస్త్రవేత్తలు ఎన్నో డ్రగ్గులను కనుగొన్నారు వాటిని ఉపయోగించి అనేక డెడ్ డిసీజెస్ ను క్యూర్ చేయగలుగుతున్నాం కానీ క్యాన్సర్, ఎయిడ్స్, సార్స్, మరియు కోవిడ్ వంటి రోగాలకు ఇప్పటికీ స్పెసిఫిక్ మందులు కొనుక్కోవడంలో ట్రీట్మెంట్ చేయడంలో నేటికీ చాలెంజ్ గా ఉంది మిగతా రంగాల వల్లే వైద్యరంగంలోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిరోజు వండర్స్ను చేస్తున్నాయి అని విద్యార్థులకు తెలియజేశారు. స్కౌట్స్ మరియు గైడ్స్ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణస్వామి మాట్లాడుతూ… ఆధునిక మానవుడు ఇంత అద్భుతంగా తయారు కావడానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ.,సైన్స్ అనగా మన చుట్టూ ఉండే ప్రకృతిలోని ప్రతి అంశాన్ని పరిశీలించి పరిశోధించి ప్రయోగాలు చేసి ఎందుకు ?, ఏమిటి ?, ఎలా ?, అని ఆలోచన చేసి నిరూపణ చేసేదే సైన్స్ అని.., టెక్నాలజీ అంటే శాస్త్రీయ పరికరాలు ద్వారా మన సమస్యలను పరిష్కరించుకొని జీవన విధానాన్ని సుఖతరం సుఖమయం చేసుకోవడమే.
మనిషి తన కన్నుతో కొంచెం దూరం వరకే చూడగలుగుతాడు కానీ సైన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఐస్ తయారుచేసుకుని బైనాక్యులర్స్, టెలిస్కోప్స్ ద్వారా వేల కిలోమీటర్ల వరకు చూడగలుగుతున్నాడు. ఆర్టిఫిషియల్ వింగ్స్ లాగా ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ తయారు చేసుకుని ఎగరుగలుగుతున్నాడు క్రేన్సు సహాయంతో టన్నులుకొద్ది బరువులను ఎత్తగలుగుతున్నాడు. ఆదిమానవుడుగా అనాగరికముగా గడిపిన మానవుడు నేడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే స్థితికి చేరుకున్నాడు. అవని నుండి అంతరిక్షం వరకు అనేక అద్భుత విషయాలను పరికరాలను కనుగొన్నాడు. పాఠశాల ఇంచార్జ్ శ్రీమతి పద్మజా పూర్ణ మాట్లాడుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎద్దుల బండి నుండి ఏరోప్లేన్స్ వరకు నేల నుండి నింగి వరకు ఆధునిక మానవుడు ప్రయాణానికి వాహనాలు తయారు చేసుకుంటున్నాడు అని విద్యార్థులకు తెలిపారు.
పాఠశాల గైడ్ టీచర్ తూర్పాటి సూర్య కుమారి మాట్లాడుతూ ఏదైనా సమాచారాన్ని చేరవేయడానికి పావురాల ద్వారా సమాచారం పంపించేవారు కానీ నేడు ఈమెయిల్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సెకండ్లలో సమాచారం ప్రపంచానికి చేరవేయడానికి పరిస్థితులు ఉన్నట్లు తెలియజేశారు. పాఠశాల ఫిక్స్ టీచర్ శ్రీమతి సింగిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ వలన మనిషికి లీజర్ టైం పెరిగిందని వినోదాలు కోసం వీధి నాటకాలు, హరికథలు, బుర్రకథలు, రేడియోలు, టీవీ చానల్స్ అభివృద్ధి చెందాయని విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి అచ్యుతుని లక్ష్మీ గారు మాట్లాడుతూ ఒకప్పుడు చంద్రుడు దగ్గరకు వెళ్లడం కలగా ఉండేది నేడు అది రియాల్టీ. ఆధునిక మానవుడు గిఫ్ట్ ఆఫ్ సైన్స్ అయినా ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్, ఎయిర్ కండిషన్స్, టెలివిజన్ మొబైల్, మోటార్ వెహికల్స్ వంటివి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేసాయి అని అన్నారు. పాఠశాల ఎన్ఎస్ టీచర్ శ్రీ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు మనిషి నిప్పును కొనుక్కోవడం గొప్ప ఆవిష్కరణ అనుకున్నాడు తర్వాత చక్రం, పేపర్, ప్రింటింగ్ మిషన్, రేడియో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇలా అనేక అద్భుతాలను సృష్టించగలిగాడని తెలియజేశారు.
స్వామి విద్యానికేతన్ ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి ఆధునిక మానవుడు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం యావత్తు శాస్త్రవేత్తలను చూసుకుంటే కేవలం 0.01% శాస్త్రవేత్తలు ఆలోచనల ద్వారా తయారు చేసిన డివైసెస్ ఈ ప్రపంచాన్ని ఇంతగా మార్చితే 10% నుండి 15% వ్యక్తులు సైంటిస్టులుగా ఈ ఆలోచిస్తే ఇంకా ఎంత బాగా మానవ జీవితం ఉంటుందో కదా అని విద్యార్థులను ఆలోచింపజేస్తూ..! ఆశ్చర్యపరుస్తూ..! సైన్స్ అండ్ టెక్నాలజీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే..
ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, ఇన్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ దీనిని చెడి కార్యక్రమాలకు ఉపయోగించగలరు, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువలన ప్రతి విద్యార్థి “థింక్ గ్లోబల్లి యాక్ట లోకల్లీ” భావన కలిగి ఉండాలని స్వామి విద్యానికేతన్ కురుమమ్మా స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిధులు గాజువాక ఎమ్మార్వో శ్రీమతి తోట శ్రీవల్లికి, పెదగంట్యాడ మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ హేమలత కి మరియు గాజువాక పట్టణంలో ఎంతో కాలంగా సేవలందిస్తున్న రెవిన్యూ అధికారి శ్రీ ఆనంద్ కుమార్ కి, మరియు 67వ వార్డు లోగల సాయిరాం నగర్ మరియు శంకర్ నగర్ ల వీఆర్వో శ్రీ సిహెచ్ రవికుమార్ కి పాఠశాల యాజమాన్యం పుష్పగుచ్చం, సాలువ, మెమొంటోలతో సన్మానం చేయడంతో పాటు వచ్చిన అతిధులు చేతుల మీదుగా ఆధునిక మానవుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబరిచిన కుమారి ఆసపు వరలక్ష్మి తొమ్మిదవ తరగతి, కుమారి డి ఇందుమతి 9వ తరగతి, మాస్టర్ నాగిరెడ్డి రమేష్ 9వ తరగతి, మాస్టర్ జీ అక్షయపాల్, ఆరవ తరగతి మాస్టర్ డి తనుషాయి ఏడవ తరగతి, మాస్టర్ టి డాన్విక్ నాయుడు నాలుగవ తరగతి. విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు మెమొంటోలతో అభినందించారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి 45 రోజులు అహర్నిశలు సహకరించిన ప్రతి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్కు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 5 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.