Mana News , అమరావతి: ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని (Vishal Gunni) గతంలో సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ముగియడంతో సస్పెన్షన్‌ను సెప్టెంబరు 25 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తప్పుడు కేసులో ముంబయి సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిపై పలు అభియోగాలున్నాయి. ముగ్గురూ అఖిలభారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *