

నెల్లూరు, మన న్యూస్,మార్చి 10:- మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మార్చి 12వ తేదీ బుధవారం నాడు, ఉదయం 10 గంటలకు నెల్లూరు విఆర్సీ కూడలి వద్ద, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, ర్యాలీగా తరలి వెళ్లి, 5 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000/-లు భృతి ఇవ్వాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకొని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్లపై జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన “యువత పోరు” కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి , శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య , మాజీ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షులు అశ్రీత్ రెడ్డి, తదితరులతో కలిసి యువత పోరు పోస్టర్ ను విడుదల చేశారు.నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…………..
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు.. మాట తప్పారు అని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో తల్లిదండ్రులు కంటికి కడవడు ఏడుస్తున్నారు అని అన్నారు. కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినప్పటికీ.. ఇంతవరకు ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దారుణం అని అన్నారు.విద్యార్థులు, యువత భవిష్యత్ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 12వ తేదీన యువత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని తెలియజేశారు. నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టబోతున్నాం.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి కలెక్టర్ కు వినతిపత్రం అందజేయబోతున్నాం . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనతో కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వం మెడలో ఉంచుతాం అని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేంతవరకు చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదు అని తెలియజేశారు.
