ఘనంగా ఉక్కు సత్యాగ్రహం సినిమా శతదినోత్సవ వేడుకలు

Mana News :- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధనౌక గద్దరన్న ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. జనంస్టార్ సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నంది అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక, నిర్మాత కారెం వినయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సీనియర్ నటుడు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్, ప్రముఖ సినీ నిర్మాత కారం మమత, ప్రముఖ గేయ రచయిత, గాయకులు మజ్జి దేవిశ్రీ, ప్రముఖ సినీ దర్శకులు రాకేష్ రెడ్డి, యాది కుమార్, శుభశ్రీ అన్నె ఇవాంజెలిన్ తో బాటు అనేకమంది ప్రముఖ దర్శక, నిర్మాతలు నటీనటులు వైజాగ్ పౌర గ్రంథాలయంలో వెండి కిరీటంతో శాలువాలతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉక్కు సత్యాగ్రహం చిత్ర దర్శక, నిర్మాత, హీరో సత్యారెడ్డి మాట్లాడుతూ..”తెలుగు ప్రజల జీవనాడి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గద్దర్ అన్న లాంటి లెజెండ్ తో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని నిర్మించాను.ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లో విడుదల చేశాం. కొన్నిచోట్ల శత దినోత్సవాలు కూడా జరుపుకోవటం ఆనందంగా ఉంది. తెలుగు జాతి కోసం ఉక్కు సత్యాగ్రహం సినిమాను నిర్మించిన తను ఇండియా గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడం కోసం త్వరలో “ఇండియా ద గ్రేట్ ” అనే బాలీవుడ్ చిత్రాన్ని ప్రముఖ నటీనటులతో నిర్మిస్తానన్నారు.విశాఖపట్నంలో ఒక ఫిలిం స్టూడియోని కూడా నిర్మించే ఆలోచన తనకి ఉందని, ఈ స్టూడియో ద్వారా కొత్త కళాకారులని ప్రోత్సహిస్తానని చెప్పారు..”. తారాగణం : గద్దర్, సత్యారెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ, ఎమ్.ఎల్.ఏ ధర్మశ్రీ, ఎమ్.వి.వి సత్యనారాయణ, ప్రసన్న కుమార్, న్నెల తదితరులు, మ్యూజిక్: శ్రీకోటి ,కంపోజర్: మేనగ శ్రీను ,కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకుడు : పి. సత్యారెడ్డి
పి.ఆర్.ఓ: మధు. వి.ఆర్.

Related Posts

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!