మరో ఎన్నికల సమరం – కూటమి Vs జగన్, సమర్థతకు పరీక్ష..!!

Mana News :- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇక, త్వరలోనే మరో ఎన్నికల సమరంకు కసరత్తు జరుగుతోంది. ఈ ఎన్నికలు ఇటు కూటమి.. అటు జగన్ సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి. ఎన్నికల సమరం :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తవుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ రెండు నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇక, త్వరలోనే మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికల పైన కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరి ష్కరించి జూన్‌లో ఎన్నికలకు వెళతామని నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని పనులు :- అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.64వేల కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల పనులు ఆలస్యమయ్యాయని, కోడ్‌ ముగిసినందున ఈ నెల 12, 15 తేదీల మధ్య పనులు వేగవంతం చేస్తామన్నారు. మూడేళ్లలో ప్రపంచంలోనే టాప్‌ రాజధానిగా అమరావ తిని నిర్మిస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 1నుంచి మునిసిపాలిటీల్లో వసూలుచేసే పన్నుల సొమ్మును ఆయా మునిసిపాలిటీల్లో అవసరాలకే వినియోగించుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులతో సమీక్షిం చి గోదావరి పుష్కరాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మళ్లీ వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందన్నారు. కీలక ఎన్నికలు :- నెల్లూరు, కాకినాడ-రాజమండ్రి మధ్య స్థల పరిశీలన కూడా పూర్తయ్యిందని, రాయలసీమలోనూ 2ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు 2029 వరకు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. ఇక, మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. ఇక, ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన 21 మున్సిపాల్టీలో జూన్ నెలలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకునేందుకు సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా మరింత పట్టు బిగించాలని భావిస్తోంది.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..