- పత్రాలు అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస,మక్తల్: మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన పెన్షన్లలో భాగంగా 16 మందికి వివిధ పెన్షన్లు మంజూరయ్యాయని, ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి, వాకిటి లలితమ్మ గారి దంపతుల చేతుల మీదుగా పెన్షన్ పత్రాలను అందజేశామని స్థానిక మక్తల్ మున్సిపల్ 16 వా వర్డ్ కౌన్సిలర్ అల్కురి పావని తెలిపారు. సోమవారం రోజు ద్వారక ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పత్రాలను అందజేయగా.. మంత్రిగారి నివాసంలో వారిని ప్రత్యేకంగా కలుసుకొని పెన్షన్ అందుకున్న వారు ధన్యవాదాలు తెలిపారు. సుమారు దశాబ్ద కాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూసామని, కాంగ్రెస్ సహాయం లో తమకు పెన్షన్లు అందడం తమకు ఆనందంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్, మక్తల్ మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా,కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అలుకూరి రవికుమార్, కల్లూరి గోవర్ధన్, వార్డ్ ఆఫీసర్ విష్ణప్ప, వినయ్ కుమార్,స్థానిక నాయకులు , ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.