విశాఖ మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 17: విజయవాడ – విశాఖపట్నం డౌన్ లైన్ లో లంకెలపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రైలు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ (50-55 సం.) మృతి చెందింది.చామన ఛాయ గల మహిళ బ్లూ కలర్ చీర, బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించి ఉంది. సంఘటనా స్థలంలో ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదు.దువ్వాడ ఆర్పీఓపీ ఎస్ఐ కెటిఆర్ లక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ, అనకాపల్లికి తరలించారు.మృతురాలి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సంబంధిత బంధువులు, ప్రజలకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలపడానికి సెల్ ఫోన్ నెంబర్ 7382058996 పోలీస్ అధికారులు ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *