మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలోనీ ఉన్నత పాఠశాలలో క్రీడా విద్యార్థులకు 25 వేల రూపాయల స్పోర్ట్స్ షూ ల పంపిణీ కార్యక్రమాన్ని హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నిర్వహించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35వ తెలంగాణ సబ్ జూనియర్ ఖో – ఖో బాల బాలికల కోచింగ్ క్యాంపును హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 35 వ జూనియర్ నేషనల్ కోకో క్యాంపును కర్ని గ్రామంలో నిర్వహించడం సంతోషకరంగా ఉందని అన్నారు. మా యొక్క గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన పి ఈ టీ రూప కొచ్ ను అభినందిస్తున్నామని అన్నారు. ఇంకా ఏమైనా స్పోర్ట్స్ కి సంబంధించిన మెటీరియాల్ ఎక్కడ దొరుకుతావో తెలుసుకోండి,అక్కడినుంచి తెప్పించుకుందాం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే తెప్పించుకుని విద్యార్థులకు సహాయ పడదామని పి ఈ టీ కోచ్ లకు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం ను మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం కూర్చొని 20 రోజులలో పాఠశాలలో ఏ ఏ కొరతలు ఉన్నాయి చర్చించుకుని ఒక లిస్ట్ ను తయారు చేయమని తెలిపారు. ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుదామని హామీ ఇచ్చారు. . విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడ విద్యార్థులకు భోజన కర్చు నిమిత్తం కొరకు. 10 వేల రూపాయలు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బాబు రెడ్డి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.చక్రధర్, గంగాధర్,పురుషోత్తం, బలరాం, రాము, వేణు గౌడ్, అంజప్ప, ఎద్దుల మారుతి, కుర్వ రావి, గోవ వెంకటేష్, హుస్సేన్, శేఖర్, సుదర్శన్ గౌడ్, ఈ మమ్, గోవర్ధన్, వెంకన్న, పాఠశాల ఉపాధ్యాయ బృందం,తదితరులు పాల్గొన్నారు.

