Oplus_131072

కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ కుటుంబంలో చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని దొణస్వామి స్వగృహంలో రూరల్ మండలానికి చెందిన కురుబ సామాజికవర్గ బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం దొణస్వామి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఇంతటి గౌరవం దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. టీడీపీలో లభిస్తున్న గౌరవం మరువలేనిదని, నిస్వార్థపరులైన నాయకులు, కార్యకర్తలు టీడీపీ–ఎన్డీఏ కుటుంబంలోనే కనిపిస్తారని ఆనందం వ్యక్తం చేశారు.అలాగే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ప్రశంసిస్తూ, సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు చూడలేదని కొనియాడారు. దొణస్వామి వంటి నిస్వార్థపరుడు పార్టీలో చేరడం తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఆయన రాకతో నియోజకవర్గంలో కురుబ సామాజికవర్గ బలం మరింత పెరిగిందని, ఆయన సలహాలు పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం రూరల్ మండల అధ్యక్షులు గోళ్ల రాము, టీడీపీ నాయకులు రామాంజినేయులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గౌడ, గరుడాపురం పాత లింగప్ప, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజకుమార్, కుర్లపల్లి రుద్రేష్, జనసేన నాయకులు అనిల్, రామచంద్రప్ప, సిబయి నందీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *