మన ధ్యాస, బ్రహ్మసముద్రం: మండల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకురాలు, ప్రముఖ టీడీపీ నేత, మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ డబ్ల్యు/ఓ కె. మల్లేశప్ప, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు, ఆదివారం కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి, విషాదానికి లోనయ్యారు.రాజకీయ ప్రస్థానం – సేవలుబ్రహ్మసముద్రం మండల జడ్పీటీసీగా పనిచేసిన సమయంలో మండల అభివృద్ధికి గంగమ్మ ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చురుకైన పాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారు. కార్యకర్తలను సమన్వయం చేస్తూ, పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు.ఆమె మృతి పట్ల నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.“కురుబ గంగమ్మ గారి మరణం పార్టీకి మాత్రమే కాదు, బ్రహ్మసముద్రం మండలానికి తీరని లోటు” అని పలువురు నేతలు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *