చిత్తూరు, మన ధ్యాస డిసెంబర్ 17 చిత్తూరు జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డి.ఇ.ఓ)గా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర ప్రసాద్ ని పి.ఆర్.టి.యు చిత్తూరు జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పి.ఆర్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.యం. గిరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డి.ఇ.ఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. ఈ భేటీలో పి.ఆర్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కనకాచారి పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకులు రేఖ, హిమబిందు, విజయలక్ష్మి, ఆష, కె.భారతి, భాస్కర రెడ్డి, ఆర్.మోహన్ రెడ్డి, దేవేంద్ర, సురేష్ బాబు తదితరులతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతన డి.ఇ.ఓని శాలువాతో ఘనంగా సత్కరించి, పూల బొకే అందజేసి, స్వీట్స్ పంచుతూ పి.ఆర్.టి.యు బృందం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాభివృద్ధికి పి.ఆర్.టి.యు సంపూర్ణ సహకారం అందిస్తుందని నాయకులు తెలిపారు.