హర్షం వ్యక్తం చేసిన కీర్తి వెంకట సుభాష్

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను పార్టీ అధిష్టానం రెండోసారి నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెంకట సుభాష్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జ్యోతుల నవీన్ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చినా సరే తన రాజకీయ ప్రస్థానాన్ని ఇర్రిపాక సర్పంచిగా ప్రారంభించి జగ్గంపేట జడ్పిటిసి సభ్యుడిగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా,కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో పూర్వ వైభవం తెచ్చిన నాయకుడు నవీన్ అని కొనియాడారు.చిన్న కార్యకర్త నుంచి మొదలుకొని నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు జిల్లాలో అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తిగా జ్యోతుల నవీన్ పేరు తెచ్చుకున్నారని,ఆయన సేవలను గుర్తించి మళ్లీ అధిష్టానం ఆయనకు రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి,రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి,సహకరించిన జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సుభాష్ అన్నారు.మళ్లీ నూతన జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించాలని ఆశాభావం వ్యక్తం చేసారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *