మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బాక్సులను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సాయుధ పోలీసు బలగాల పటిష్టమైన భద్రత నడుమ సురక్షితంగా తరలించడం జరిగింది.ఈ తరలింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. పోలింగ్ బాక్సులు అన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకున్నాయని అధికారులు తెలిపారు.ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *