మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోని రైతులు ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి,సీసీ సాయిలు,నాయకులు గుర్రపు శ్రీనివాస్,ప్రజా పండరి,తదితరులు ఉన్నారు







