

కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి దేవాలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు. ముందుగా ఉబయదారులు మేల తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పుర వీదులగుండా ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకుని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేసి స్వామి వారిని ఏకాంత మందిరంలో ఉంచి సేవ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ ఉభయదారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
