ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి మాట్లాడుతూ….. ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో గడపగడపకు వెళ్లి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించే విధంగా గర్భవతులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతపై ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ముర్రుపాలు బిడ్డకు శ్రీరామరక్ష అని తెలిపారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ లక్ష్మీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్, సూపర్వైజర్లు సుశీలమ్మ, నాగ శంకర్, హెల్త్ అసిస్టెంట్ సంపత్ కుమార్, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *