

మన న్యూస్ ఐరాల జులై-28:-
జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో, చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు 2 సంవత్సరాల ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు ఇద్దరు అనాథలయ్యారు. వీరి యొక్క ఆలనా పాలన వారి యొక్క పెదనాన్న, పెద్దమ్మ తీసుకున్నారు. వీరి యొక్క పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి తక్షణ సాయం కింద, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయము, మరియు ఇద్దరు పిల్లలకి నెలకి 4000/- రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒక లక్ష రూపాయలు చెక్కు కూడా మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా ఇద్దరు పిల్లలు యొక్క చదువు కోసం అమర్ రాజా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్లకి ఉచిత విద్యను కూడా అందించడానికి జిల్లా కలెక్టర్ చొరవ చూపారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబునాయుడుకి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చెక్కును అందించడం జరిగింది.
ఈ పిల్లను ఆదుకున్నందుకు ఈ చిన్న పిల్లల పెదనాన్న పెద్దమ్మ మరియు వారి తాత రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేశారు.