

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో గూడూరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల డాక్టర్ సి ఆర్ రెడ్డి భవనము నంద లి అయ్యల చంద్రమ్మ భాస్కరరావు ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ జి సంఘమిత్ర మాట్లాడుతూ నరాల సమస్యలపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 35 సంవత్సరముల పైబడిన వారు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ పి. జగదీష్ మాట్లాడుతూ 60 శాతం మంది డయాబెటిక్‌తో బాధపడుతున్నారని ఆహార నియమాలు తప్పక పాటించాలని కోరారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన్ సాయి రూప మాట్లాడుతూ ప్రతి ఆడవారు సంవత్సరానికి ఒకసారి అన్ని రకాల టెస్టులు తప్పక చేయించుకోవాలని తెలిపారు. తదుపరి రోగులకు అందరికీ పరీక్షించి, డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అన్ని విభాగాలలో ఉచిత మందులను కిమ్స్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఇవ్వడం జరిగినది. క్యాంప్ చైర్మన్ లయన్ షేక్ .రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి పేదల కోసం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రముఖులు డాక్టర్ చంద్రహాస్, మధురమేటి రమణయ్య, మల్లెమాల మురళి రెడ్డి, బీ. సీనయ్య , సోమిశెట్టి చెంచురామయ్య, రూపేష్ రెడ్డి, ఆర్ రవిచంద్ర, వీరేంద్రనాథ్, అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి, డాక్టర్ సుగుణమ్మ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, రోగులు, హాజరై పరీక్షలు నిర్వహించుకుని ఉచిత మందులను తీసుకోవడం జరిగినది. కిమ్స్ హాస్పిటల్ పి ఆర్ ఓ నవీన్ విజయకుమార్ మాట్లాడుతూ క్యాంపు విజయవంతమైందని 150 మందిని పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

