

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కుడుముల వెంకటనారాయణ దాతృత్వం లో భారత్ పెట్రోల్ బంకు నందు దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు నారాయణ గారి ద్వారా పంపిణి చేయడమైనది.. జే.వి.వి. ఉపాధ్యక్షులు చెంచునారాయణ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణి చేయడం చాలా సంతోషంగా ఉందని కుడుముల నారాయణ మా జే.వి.వి. కి అన్ని విధాలా సహకారం ఇస్తున్నారని వారి కుటుంబానికి దేవుడు అన్నివిధాలా అండగా ఉండాలని కోరారు. వారి మనుమరాలు జులై లో పుట్టినందున ఈ నెల దాతృత్వం వహిస్తున్నారని చెప్పారు..ఈ కార్యక్రమంలో కుడుముల నారాయణ దంపతులు జే .వి.వి. ప్రతినిధులు చెంచునారాయణ, నాగరాజు, పురుషోత్తమ రావు, సుమన్ రెడ్డి, రాదయ్య, శ్రీనివాసాచారి, అరుణ్ కుమార్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు..