

గూడూరు, మన న్యూస్ :- ప్రజా నాయకుడు, సౌమ్యుడు వివాదరహితుడు, పెద్దలు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తనకి ఎలాంటి సంబంధం లేని మద్యం కేసులు అక్రమంగా ఇరికించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, బాధాకరం అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని..వైయస్సార్సీపి ఇంటలెక్చువల్స్ ఫోరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్వి సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు… మిథున్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, భవిష్యత్తు రాజకీయాలల్లో అందరికి మంచి చెయ్యాలని తపన పడే వ్యక్తి…. అలాంటి వ్యక్తి … త్వరలో ఆయన కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు.. ఈ తాటాకు చప్పుళ్ళకు అక్రమ కేసులకు జగన్ అన్న అభిమానులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు అని.
ఇలాంటి అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్దేశపూర్వకంగా కొంతమంది వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలని టార్గెట్ చేసి వారిని అణిచివేయాలని ఉద్దేశంతో కక్షపూరిత రాజకీయాలతో వారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లో నుంచి బయటకి రాకుండా సంబంధం లేని కేసులు వేరు వేరు చోట్ల పెట్టి కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు జైల్లోనే ఉంచి వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని వారి మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఇకనైనా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.