

మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఏ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని 75 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం చైతన్యాన్ని కలిగించడం లక్ష్యంగా కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు: సర్పంచ్ సి. చిట్టెమ్మ బి. సుబ్రహ్మణ్యం ఏపిడి టి. హరి ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో జడ్పీహెచ్ స్కూల్ హెడ్మాస్టర్ ఎన్. బాల, ఏపీఓ రమ్య, ఈసీ ప్రవీణ్, అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో)
శ్రీనివాసులు రెడ్డి ప్లాంటేషన్ సూపర్వైజర్ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని, పచ్చదనం పెంపొందించడం మరియు పరిశుభ్రత పరిరక్షణకు కట్టుబడి ఉండాలని. తెలియజేశారు.