

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ ను సుబ్బరామయ్య బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పంచాయతీల కు రావలసిన నిధులు, సర్పంచులకు సకాలంలో ఫండ్స్ విడుదల చేస్తే గ్రామాల అభివృద్ధి మరింత జరిగే అవకాశం ఉందని మంత్రికి వివరించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి త్వరలో నిధుల విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.