అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

ఉరవకొండ మన న్యూస్:అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సీపీఎం నాయకులు విరుపాక్షి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు.
వజ్రకరూరు మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తి సమ్మె ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ దగ్గర నుండి గాంధీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత ఎంపీ మల్లికార్జున ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
.రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విరుపాక్షి మాట్లాడుతూ… ఈ పాపాలన్నిటికీ ప్రధాన బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రధానమంత్రి మోడీదే. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలకు పూనుకున్నది నిబంధనలు మార్చేసింది దేశంలోని ప్రతి వినియోదారుడికి స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్ రంగం మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు ద్వారా దత్తం చేయాలని ముఖం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అప్పులు ఎర్ర చూపించి లొంగదీసుకున్నది గత వైసిపి ప్రభుత్వం గుడ్డిగా సంతకాలు పెట్టింది వాటిని మార్చుతామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అదే దారిలో నడుస్తుందని, గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని చెప్పిన తెలుగుదేశం నేతలు నేడు మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడం మోసపూరితం అని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాలు కొనసాగించాలి. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి. పని గంటలు పెంచడం కాదు కనీస వేతనాలు పెంచాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, అప్కాస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సురేష్, సిఐటియు అంజి, కసాపురం రమేష్, అంగన్వాడి కార్యకర్తలు సువర్ణమ్మ , హెలిన రాణి, నాగమణి, జానకి, మధ్యాహ్న భోజనం కార్మికులు రంగమ్మ, చాబాల సుధాకర్, హమాలీ కార్మికులు కమలపాడు పెద్దన్న, వెంకటేష్, షేక్షావలి, చంద్రశేఖర్, మా భాష, సత్యసాయి కార్మికులు లాలు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం