చివరి ఆయకట్టు వరకు నీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా కుడి కాలువ కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లి కి పూజలు నిర్వహించి నీటి విడుదల చేయడం జరిగినది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ర్యాలంపాడు రిజర్వాయర్ పంప్ హౌస్ ను ప్రారంభించి రైతులకు సకాలంలో నీటిని అందించే చేశారు. రైతులు సమన్వయంతో నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులకు వ్యవసాయానికి అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, చేయడం వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులు పండించిన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు విధంగా వరి కొనుగోలు కేంద్రాలను చేయడం జరిగినది. ప్రస్తుతం వానకాలం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కావడం జరుగుతుంది కావున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు గాని ఈ సంవత్సరం నీటిని విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి , నాయకులు శ్రీనివాస్ రెడ్డి,డి.ఆర్ విజయ్, డి.వై రామన్న, శ్రీరాములు, రాముడు, విజయ్ రెడ్డి, సంగాల నర్సింహులు, తిమ్మప్ప, యువ నాయకులు పురుషోత్తం రెడ్డి, అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్ మన ధ్యాస :ఎ

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్లో ప్రమాదం

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ