

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సివిఆర్ కుమార్, సీపీఐ చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కె. నారాయణ , ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాఘవయ్య, యాకోబు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.