అదానీ, సెకీ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలీ – సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు

మన న్యూస్ పార్వతీపురం జూలై 5:- పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలనీ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి, అదానీతో , సెకీ సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని అదాని, సెకీ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో విద్యుత్ చార్జీలను మూడుసార్లు పెంచి ప్రజలపై 15,487 కోట్లను భారం వేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను చెల్లించుకోలేక గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే మరల విద్యుత్ చార్జీలు పెంచడం శోచనీయం అని ఎద్దేవా చేశారు, ఇప్పటికే ఇంటి పన్నులు నీటి చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే మరలా విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు మరచి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్లాది రూపాయల ప్రజల కష్టార్జితాన్ని దారాదత్తం దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం విధానాలపై అవలంబిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఒప్పందాలు రద్దుకై, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేవరకు కలిసొచ్చిన వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల తో కలిపి ప్రజలను ఐక్యం చేసి పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, ఈవీ నాయుడు, కూరంగి గోపీ నాయుడు, జిల్లా సమితి బీటి నాయుడు, సాలాపు అనంత రావు, సింహాద్రి దుర్గారావు, సింహాద్రి కిరణ్, పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///