కల్కి జ్యూలయర్ షాపు యజమాని కోలగట్ల గోపి అరెస్ట్ – అల్లుడు మాదేటి సుధీర్ పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన పోలీసులు

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయుడు రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కల్కి జూనియర్ షాప్ ఓనర్ కోలగట్ల. గోపాలరావు( గోపి)ని 41 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతని అల్లుడు మాదిటి సుధీర్ పూచికత్తుపై స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు స్థానిక విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే సాలూరు పట్టణం లో ఎందరో పేద విద్యార్థులకు చదివిస్తూ అలాగే సంఘ సేవ చేస్తున్న మాస్టారు రంభ రజినీకాంత్ పై గతంలో కోలగట్ల గోపి టౌన్ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ కేసు పెట్టడం జరిగింది. అనంతరం రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు అని సాలూరు కోర్టులో తీర్పు రావడంతో ఆయన పై కేసు పెట్టిన గోపి పై ఐపీఎస్ 177 క్రింద చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టువారి ఆదేశాల ప్రకారం 67/2025 నెంబర్ తో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అలాగే ప్రాథమిక విచారణ అనంతరం కోలగట్ల గోపాలరావు (గోపి) ని అరెస్ట్ చేశారు.ఇలాగే తప్పుడు కేసులు పెట్టిన వారికి తగిన శిక్ష పడుతుందని ఈ కేసుతో రుజువైంది.

Related Posts

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

మన న్యూస్ సింగరాయకొండ:- దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య…

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్.  రాజీ విధానం రాజ మార్గం

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం