మన న్యూస్,తిరుపతి:– ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శాప్ చైర్మన్ రవినాయుడు టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద టీమ్ రవినాయుడు సభ్యులందరూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రుయా ఆసుపత్రి ఎదుట రోగులకు, అన్నార్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, తెలుగుయువత నాయకులు తోట వాసుదేవ, రంజిత్ నాయుడు, సునీల్ కుమార్ రెడ్డి, సుబ్బు యాదవ్, దిలీప్ రాయల్, బాబీ రాయల్, శరత్, రూపేష్, ధోనీ రెడ్డి, లోకేష్ రాయల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *