

గొల్లప్రోలు మే 16 మన న్యూస్ : గొల్లప్రోలు మండల పరిధిలోని వన్నెపూడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ జన్మదిన వేడుకలు గ్రామ పంచాయితీ సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి వర్మ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం లో వర్మ లాంటి రాజకీయ నాయకుడు లేడని,అపర భగీరథుడు గా పేరు తెచ్చుకున్నారని అన్నారు.పార్టి కష్టాలు లో ఉన్నా కార్యకర్తలకు అండగా వర్మ ఉన్నారన్నారు.కొద్దినెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు ప్రకారం కూటమి అభ్యర్థి ని బలపరచి నట్లు తెలిపారు.వర్మ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం గా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కంద రామకృష్ణ,రాజంశెట్టి లోవేశ్వరుడు,కంద వెంకట రమణ, బెల్లంకొండ అప్పారావు,ఆర్ నాగేశ్వరరావు,కె రాయుడు, వెంకట కృష్ణ, రాంబాబు, పలువురు టిడిపి కార్యకర్తలు అభిమానులు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం స్వీట్ లు పంచి వర్మ జన్మదిన వేడుకలు లో లీనమయ్యారు.
