

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం..
“అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..”
“పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “
మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద నూతనంగా బీటీ రోడ్డుకు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ చేశారు. బుధవారం ఉదయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్కి ఐరాల మండల టిడిపి అధ్యక్షులు గిరిధర్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి చేతుల మీదుగా మొరంపల్లె గ్రామం నుండి ఐరాల చిన్నగొల్లపల్లె గ్రామానికి 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే స్ధానిక గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలుపై ఆరా తీశారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతోనే పూతలపట్టు నియోజకవర్గానికి విస్తృతంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని రహదారులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్ధానాలు చేరుకునే అవకాశంతో పాటు గ్రామాల మధ్య రవాణా వేగవంతం అవుతుందన్నారు. అలాగే మండలాల్లో ఏ ప్రాంతానికైనా సంబంధించి సమస్యలు ఉంటే, సంబంధిత ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. “ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రతి గ్రామానికి మంచి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, వైద్యం, విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం మాటలకు కాకుండా చేతల్లో చూపించాలన్నదే తన లక్ష్యమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల టిడిపి అధ్యక్షులు గిరిధర్ బాబు, చిత్తూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు నాయుడు, మొరంపల్లె స్ధానిక నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, దిలీప్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, స్ధానిక గ్రామస్తులు పాల్గోన్నారు.