

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 15: గోపవరం మండలం పి పి కుంట వద్ద గత రెండు సంవత్సరాలుగా నీడ గూడు లేని నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ స్వార్థాలకు అనుకూలంగా గోపవరం మండల తహసిల్దార్ త్రిభువన్ రెడ్డి వత్తాసు పలుకుతూ,నిరుపేద ప్రజల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించడం సబబు కాదని గురువారం నాడు గోపవరం తహసిల్దార్ త్రిభువన్ రెడ్డి కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ స్థానిక నాయకులు ఆధ్వర్యంలో నిరుపేదలు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమం కు మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర,,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి విరశేఖర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభం శుభం ఎరగని నిరుపేదలపై స్థానిక తహసిల్దార్ దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని,నిరుపేద మహిళల పై చేయి చేసుకోవడం పెదలపై దౌర్జన్యంకు పాల్పడిన గోపవరం తహసిల్దార్ త్రీ భువన్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలని రాజకీయ ఖర్డర్ చొక్కా నాయకుల అడుగులకు మడుగులు ఎత్తుతున్నారని గత రెండు సంవత్సరాలనుండి పీపీ కుంట వద్ద నివాసం ఉంటున్న పేదల జోలికి రాకుండా ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కజేయకుండా చట్టావ్యతిరేకంగా వ్యవహరించడం చేసిన గోపవరం తహసీల్దార్ ని విధులనుండి తొలిగించేంతవరకు తమ నిరసన కొనసాగుంతని నిరుపేదలకు న్యాయం చేయాలని నైతిక విలువలను కాపాడుకోవలసిన అధికారులే చట్ట వ్యతిరేకంగా నిరుపేదలపై తమ స్వార్థానికి వచ్చినట్లు పెత్తనం పులమాలనుకుంటే సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకోని వారికి అండ దండ ఉండి వారి కష్టాలను సమస్యలను పరిష్కరించవలసిన అధికారులే వారిపై విచక్షణ రహితంగా పలు అసభ్యకర పదజాలంతో దూషించడం ఎంతవరకు సబబు అని వాపోయారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి విరశేఖర్,పట్టణ కార్యదర్శి బాలు, పి.వి రమణ, ఓబులేసు మరియు పలువురు అఖిల పక్ష సంఘాల నాయకులు, నిరుపేద ప్రజలు పాల్గొన్నారు.