మన న్యూస్, తిరుపతి :– వేషాలమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం దంపతులు, కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి వేషాలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకొని వివిధ వేషధారణలతో వచ్చిన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నేత మధు, ఉత్సవ కమిటీ సభ్యులు రమణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.