

మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువ తో ఘనంగా సత్కరించారు. నారా లోకేష్ కు వేసిన శాలువను తిరిగి మంత్రి సింగంశెట్టి సుబ్బరామయ్యకు వేసి సత్కరించారు. రాబోయే రోజుల్లో మంచి శుభవార్త వింటావని నారా లోకేష్ సుబ్బరామయ్యకు సూచించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ సత్యవేడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.