

మన న్యూస్,నెల్లూరు /తిరుపతి, మే 7 :- ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి తీర్మానించింది. టిటిడి చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో టిటిడి సభ్యురాలు మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. గతంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెం.604లో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్భన్ సర్వే నెం.588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయింపునకు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి రూరల్ లోని సర్వే నెం.604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నెంబర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా ఇతర ముఖ్యమైన అంశాలపై వారు చర్చించారు.ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వీరబ్రహ్మం తదితరులతో పాటు కోవూరు శాసన సభ్యురాలు, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
