తిరుపతి, మే 4 (మన న్యూస్):తిరుపతి జిల్లా డిసిసిబి (DCCB) బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డికి టెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నగర మాజీ అధ్యక్షుడు జె.డబ్ల్యూ. విజయ్ కుమార్, పార్టీ సీనియర్ నేత కందాటి సురేష్ లు రాజశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం (ఫ్లవర్ బొకే) అందజేశారు. వారి అభినందనల మధ్య చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సత్యవతి, చల్లా షణ్ముగం, మల్లెపూల బాలు, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *