మన న్యూస్,తిరుపతిఃతాతయ్యగుంట గంగజాతర వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ఆవిష్కరించారు. మే 6వ తేది చాటింపుతో జాతర ప్రారంభమై మే 13వ తేది వరకు జరుగుతాయని ఆయన చెప్పారు. మే 14 తేది తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుందని ఆయన తెలిపారు. మే 10వ తేది అమ్మవారికి శేషవస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయన వివరించారు. గత ఏడాది ఎన్నికల కారణంగా అధికారుల పర్యవేక్షణలో జాతర జరిగిందని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైయ్యాక జరుగుతున్న మొదటి జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాయలసీమలో అతి పెద్దదైన తాతయ్యగుంట గంగ జాతరను సంప్రదాయబద్దంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రోజుకో వేషంతో అమ్మవారిని భక్తులు కొలుచుకోవడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా సామాన్యభక్తులకు అమ్మవారి దర్శనం శీఘ్రగతిన అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఈఓ జయకుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, బిజేపి నాయకులు అజయ్, జనసేన నాయకులు రాజారెడ్డి, పులుగోరు మురళీ, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, ఆముదాల తులసి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.
