Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కేఫ్‌లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *