

మనన్యూస్,కామారెడ్డి:న్యాయస్థాన భవన సముదాయంలో జాతీయ లోకాలాత్మ ప్రారంభిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే నేరాలు జరుగుతాయో వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిలుపునిచ్చారు. రోజురోజుకి నేరాలు ఎక్కువ సంఖ్యలో అవుతున్నాయని వాటిని నిరోధించి కోర్టుల పని భారాన్ని తగ్గించాలని కోరారు. దేశంలో దాదాపు మూడు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి దాదాపు 250 సంవత్సరాలు పడుతుందని ఆయన తెలిపారు. వీటితోపాటుగా ఎప్పుడు మళ్లీ కొత్త కేసులు నమోదవుతాయని వీటిని పరిష్కరించడం పరిష్కరించడంలో న్న్యాయ మూర్తుల పాత్ర అతి ముఖ్యమైనదని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు జాతీయాలోకాలతో భాగంగా మార్చి ఒకటో తారీకు నుంచి నిన్నటి వారికి 1014 కేసులు లో అవార్డులు జారీ అయ్యాయని ఇంకా ఈరోజు రాత్రి వరకు నిర్వహించి ఎక్కువ కేసులు రాజీ పడడానికి ప్రయత్నం చేస్తున్నామని దానికోసం అన్ని తగిన చర్యలు తీసుకున్నామని జిల్లాలో మొత్తం ఏడు బెంచులు ఏర్పాటు చేశామని కక్షితరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు Lok Adalath ల ద్వారా లబ్ధి ఎలా పొందారో ఒక ఉదాహరణగా చెబుతూ మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గారు తను కొత్తగా నియామకమైన రోజులలో ఒకే కుటుంబానికి సంబంధించి ఒక ఆవు కోసం వచ్చిన కేసులో ఇద్దరూ అన్నదమ్ములు వారి యొక్క కుటుంబ సభ్యులు మొత్తం కలిపి దాదాపు 100 మంది ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం చాలా బాధాకరమని కలత చెందానని ఇరువర్గాలను మరియు వారి కుటుంబ సభ్యులను పెద్దలను న్యాయవాదులను పోలీస్ సిబ్బందిని అందర్నీ ఆ ఊర్లో కూర్చోబెట్టి ఇరు పార్టీలకు అమోదయోగ్యంగ ఆ కేసును పరిష్కరించినట్లు గుర్తు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ నాగరాణి మాట్లాడుతూ ఒక కేసు court పరిధిలోకి రాగానే ముందస్తు చర్యలో భాగంగా వారి మధ్య సఖ్యతను చేకూర్చే విధంగా మధ్యవర్తిత్వ చట్టాన్ని ఇంకా బలోపేతం చేస్తామని తెలిపారు. సీనియర్ Civil Judge డాక్టర్ సుమలత మాట్లాడుతూ క్షమించే గుణం ఉంటే వాళ్లు అందరికంటే పెద్ద మనసు ఉన్న వారిని ఎవరు గెలిచినా ఆ కోర్టులో వాళ్లు పై చేయి సాధించినట్లు కారని రాజీ కుదుర్చుకున్నప్పుడే కక్షిదారులు సఖ్యతగా ఉంటారని తెలిపారు. జూనియర్ న్యాయ అధికారులు కే.సుదాకర్, బీ. దీక్ష వాళ్ళ యొక్క అనుభవాన్ని కేసుల యొక్క పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది గత వారం రోజులుగా కక్షిదారులను పిలిపించి Lok Adalat లలో రాజీ చేయడానికి ప్రయత్నించిన సిబ్బందికి, సహకరించిన కక్షిదారులకి ధన్యవాదములు తెలిపారు. కేసుల రాజీ కొరకు అన్ని పోలీస్ స్టేషన్ కి ముఖ్య ఆదేశాలు జారీ చేశామని అలాగే సైబర్ క్రైమ్ కేసు lu రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వాటి ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్ గౌడ్, అశోక్ దామోదర్ రెడ్డి, లోకదాలత్ సభ్యులు సిద్ధ రాములు, శంకర్ రెడ్డి, శివరాత్రి ప్రతాప్, వాసుదేవరెడ్డి, అన్వర్షరీఫ్, రజనీకాంత్, కే.లత, బాల్రెడ్డి, షబానా బేగం, అంగరాజు, సలీం, వేణు ప్రసాద్ మరియు టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ రామన్ ఇతర సీఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షకుడు చంద్రసేన్ రెడ్డి సిబ్బంది Samiullah Khan, ప్రణీత్, శ్రావణ్, సాయి కృష్ణ, సంధ్య, ఉదయ జ్ఞాని, అనూష తదితరులు పాల్గొన్నారు
