

Mana News, అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram)లోని సత్యగిరి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్‌కు ఢీకొట్టించారు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.