

మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు
సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు సమాజానికి ఎంతో మేలు చేయాలని అహర్నిశలు కృషి చేస్తారు. అలాంటి వ్యక్తే పై ఫోటోలో కనిపిస్తున్న రాములు, రక్తసంబంధం కాకపోయినా అన్నీ తానై దహన సంస్కారానికి చేయాల్సినటువంటి క్రియ పూర్తి చేస్తూ అందరితో మన్ననలను పొందుతున్న ఇలాంటి మహానుభావులను మనమందరం ఆదర్శంగా తీసుకొని మన తరంలోని యువత కూడా ముందుకు రావాలి…. “రాములు” షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 300 మంది చనిపోయినప్పుడు వారికి దహన సంస్కారాలు చేయించాడు. మానవసేవే మాధవసేవగా నిరంతరం సేవ చేస్తున్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకులు ప్రేమ్ గాంధీ సరూర్నగర్ లోని తన ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం సమావేశంలో పేర్కొన్నారు.