మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రమాదవశాత్తు నీట మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సె కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామానికి చెందిన గున్కుల పోశయ్య మారుడు శివానంద్(18) బాన్సువాడ లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం మల్లూరు లోని అత్తమ్మ ఇంటికి వచ్చాడు.అక్కడ అత్తమ్మ కుమారుడు సందీప్, ఇతరులతో కలిసి ఆదివారం సాయంత్రం మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళాడు. నదిలోకి దిగిన అతడు ప్రమాదవశాత్తు ఈత రాక నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి గున్కుల పోశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *