

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న సేవలను సిబ్బంది తమ కస్టమర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా హాజరై సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ మాట్లాడుతూ..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 11 నవంబర్ 1919న ముంబైకు చెందిన సేథ్ సీతారాం పొద్దార్ స్థాపించారు. బ్యాంకు కార్పొరేట్ కార్యాలయాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, బ్యాంకుకు నాలుగు శాఖలు ఉన్నాయి – మూడు ముంబైలో, సౌరాష్ట్రలో ఒకటి వాణిజ్య కేంద్రాలలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పవన్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్, దర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, నాగం శ్రీనివాస్, నాగేష్,సురేష్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.