మండల స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా వైద్యాధికారి సుధారాణి.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 18 మన న్యూస్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందని,అందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి జిల్లా వైద్యాధికారిగా ఉన్న తనను, మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాటిపై ఆరా తీసి వాటి బాగోగుల పట్ల నివేదిక కలెక్టర్ కు ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు.మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో,బంగారుపాలెం ఎంపీపీ స్కూల్ నందు మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. అక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఎలా కల్పిస్తున్నారని పిల్లలకు పెట్టే భోజనంలో, మెనూ ప్రకారం అందించాలని తేడా కనిపిస్తే వెంటనే స్కూల్ సిబ్బంది, వంట వారిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. రోల్,శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్కూల్ పరిశుభ్రత, ఫుడ్ క్వాలిటీ, చిక్కీస్ ఎక్స్పైరీ కాకుండా చూసుకోవడం, పిల్లల ఫీడ్బ్యాక్ పై ఆరా తీశారు.తదుపరి బంగారుపాళ్యం హెచ్ డబ్ల్యు లో గల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడ రికార్డులను పరిశీలించి చిన్నపిల్లల పట్ల కొంతసేపుముచ్చటించి,వారికిచాక్లెట్లను పంచిపెట్టారు.ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ను మధ్యాహ్నం రెండు గంటలకు తనిఖీ చేసి ఆవరణలో మొక్కలు పెంచాలని, చెట్లను నాటాలని హాస్టల్ వార్డెన్ కే.పల్లవి కి సూచించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా( లేదా )అని వార్డెన్ పల్లవిని అడిగి తెలుసుకున్నారు. మంచి భోజనం అందిస్తున్నట్టు విద్యార్థినిలు 54 మంది ఉన్నట్లు వార్డెన్ పల్లవి తెలియజేశారు. హాస్టల్ శిథిలావస్థలో ఉన్నట్లు, వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని, జిల్లా వైద్యాధికారి సుధారాణికి తెలిపారు. నూతన భవనం ఏర్పాటు కోసం కలెక్టర్కు నివేదిక పంపిస్తామని ఆమె తెలియజేశారు.ఈరోజు నుండి మండలంలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొన నున్నట్లు డిఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు.కార్యక్రమంలో తుంబ కుప్పం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లోహిత్ చెంగల్ రాయన్, ఎం పి హెచ్ ఈ ఓ రమేష్, ఎమ్మెల్ హెచ్ పి పునీత్, సూపర్వైజర్ హరికృష్ణ, ఆముద,హెల్త్ అసిస్టెంట్ ఎన్.శరత్ కుమార్, ఏఎన్ఎం గౌతమి, ఆశయ కృష్ణవేణి శాంతి మీనా, హాస్టల్ వార్డెన్ పల్లవి, అంగనవాడి హెల్పర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు