తవణంపల్లి ఫిబ్రవరి 18 మన న్యూస్

మండలంలోని తవణంపల్లి ఉన్నత పాఠశాల నందు అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తవణంపల్లి మండలంలోని తవణంపల్లి పాఠశాల నందు మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో భాగంగా 6 రోజుల శిక్షణ తరగతులను ఎంఈఓ1 హేమలత, త్యాగరాజు రెడ్డి 2, ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ హేమలత మాట్లాడుతూ జ్ఞాన జ్యోతి శిక్షణలో భాగంగా పూర్వ ప్రాథమిక స్థాయిలో అంగన్ వాడి కేంద్రాలను బలోపేతం చేస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి మెలకువలు నైపుణ్యాలు, తీర్చిదిద్దటంలో ప్రధాన పాత్ర పోషించాలని, తెలియజేశారు. అనంతరం సిడిపిఓ శ్రీమతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరాజుల రెడ్డి పాల్గొని శిక్షణకు సంబంధించి ఉద్దేశాలు లక్ష్యాలను అంగన్ వాడి కార్యకర్తలకు తెలియజేశారు.ఆరు రోజుల జరిగే శిక్షణ కార్యక్రమంలో మొదటిరోజు పిల్లలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మధుబాబు, బాలచంద్రారెడ్డి, పెద్దబ్బరెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, అంగన్ వాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *