

మన న్యూస్ ఎల్లారెడ్డి 13:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వాయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదిన సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు..
ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యపరిచి సంక్షేమ పథకాలను వివరించి ఎన్నికలలో విజయం సాధించాలని అయన కార్యాకార్తలకు కోరడం జరిగింది