

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోమాతుమూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం& గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భోగి మంటను వెలిగించి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి,మహిళలు వేసిన రంగవల్లులు తిలకించి వారిని అభినందించిన మంత్రి సంధ్యారాణి హరిదాసు వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి వారితో ముచ్చటించించిన మంత్రి సంధ్యారాణి చిన్నారులకు భోగి పళ్ళు వేసి, గర్భిణీలకు శ్రీమంతాలు చేసి, ఆనందంగా వుండాలని ఆశీస్సులు అందించిన మంత్రి సంధ్యారాణి మాతుమూరు గ్రామంలో గోకులాలు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశుసంపద, పాడిపంటలు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియచేసిన మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లాలో 5 కోట్ల వ్యయంతో గోసాలలు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
గత ప్రభుత్వంలో పశుసంరక్షణను పూర్తిగా నిర్వీర్యం చేసింది అని అన్నారు,గత ప్రభుత్వంలో ఆరాధ్యదైవం అయిన సింహాచలం దేవస్థానం గోసాలలను పూర్తిగా నిర్వీర్యం చేసి, దాణా పెట్టకుండా గోవులు అనారోగ్యంతో మరణించిన పరిస్థితి ఉండేది అన్నారు. మంత్రి సంధ్యారాణి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి ఇంటిలో గోవులు సంరక్షణ జరగాలనే ఉద్దేశంతో గోకులాలను ప్రోత్సహిస్తుంది అని మంత్రి సంధ్యారాణి అన్నారు ఉగాది నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అవుతాదని మంత్రి సంధ్యారాణి అన్నారు త్రాగునీరు,రోడ్లు సమస్య ఏ గిరిశిఖర గ్రామాల్లో లేవు అనే మాట రాకుండా ఏడాదిలో పూర్తి చేస్తాం మని మంత్రి సంధ్యారాణి అన్నారు
గిరీశిఖర గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వం ధ్యేయం మనీ మంత్రి సంధ్యారాణి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం మనీ మంత్రి సంధ్యారాణి అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

