- నవంబర్ 17న రాష్ట్రవ్యాప్త సామూహిక సెలవును విజయవంతం చేయాలని పిలుపు.
మక్తల్,మన ధ్యాస: ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరిమికొట్టవచ్చు, కానీ మనవాడే ద్రోహం చేస్తే ఉపేక్షించేది లేదు,అన్న ప్రజాకవి కాళోజీ మాటలను స్మరిస్తూ, నేడు ఉద్యోగుల భవిష్యత్తు కోసం జరుగుతున్న సీ పీ ఎస్ రద్దు పోరాటానికి మద్దతు ఇవ్వని వారిని ఉద్యమ ద్రోహులుగానే పరిగణించాల్సి వస్తుందని టీఎస్ సీపీఎస్ఈయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సకిరం మహాదేవ్ స్పష్టం చేశారు.మఖ్తల్ ఇరిగేషన్ సర్కిల్ నం-3 కార్యాలయంలో నిర్వహించిన ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని, పాత పెన్షన్ విధానాన్ని ఓ పీ ఎస్ పునరుద్ధరించేంత వరకు ఉద్యమం ఆగదని తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 17న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త సామూహిక సెలవు ( మస్ సీ ఎల్ ) ఉద్యమంలో ప్రతి ఉద్యోగి పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ఈయు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎం. మునెప్ప, టీ ఎన్ జి ఓ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. దామోదర్, ఇరిగేషన్ శాఖ సిబ్బంది మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.