​• జాతీయ స్థాయిలో మెరిసిన మన పిల్లలు ఇంటర్నేషనల్ స్థాయిలో సాధించాలి…
రెయిన్బో సంస్థల చైర్మన్…పి . అతావుల్లా ఖాన్.
​• క్రీడల్లో ప్రావీణ్యంతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు..
​• తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ శిక్షణతోనే జాతీయ పతకాలు సాధ్యమయ్యాయి…

​రేణిగుంట:

మహారాష్ట్రలోని నాందేడ్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగిన 23వ సబ్-జూనియర్ నేషనల్ జంప్ రోప్ ఛాంపియన్‌షిప్ (2026-27) పోటీలలో రేణిగుంటలోని రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. ఈ పోటీలలో సాధించిన అసాధారణ విజయంతో మన పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
​జాతీయ స్థాయి విజేతల వివరాలు:
​బాలికల విభాగం..

​కే. ప్రణవి (8వ తరగతి) – వెండి మరియు కాంస్య పతకాలు,
​కే. దీప్తి హనీ (8వ తరగతి) – వెండి పతకం,
​కార్తున్య ఎస్ (7వ తరగతి) – వెండి పతకం,
​కే. కీర్తి (8వ తరగతి) – కాంస్య పతకం,
​కే. దీపన్విత (8వ తరగతి) – కాంస్య పతకం,
​బాలుర విభాగం…
​ఎస్లి నక్షత్ర (8వ తరగతి) – కాంస్య పతకం,
​దీక్షిత్ (8వ తరగతి) – కాంస్య పతకం,
​రిహాన్ (9వ తరగతి) – కాంస్య పతకం,

​కోచ్ అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే విజయాధారం.. చైర్మన్ పి . అతావుల్లా ఖాన్.

​ఈ సందర్భంగా రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ పి . అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ… “జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పాఠశాలకు, మన ప్రాంతానికి ఎంతో పేరు తెచ్చిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేడు జాతీయ స్థాయిలో మెరిసిన మన పిల్లలు రేపు అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించి దేశ కీర్తిని నిలబెట్టాలి. క్రీడల్లో ప్రావీణ్యంతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది” అని తెలిపారు.
​పిల్లలను క్రమశిక్షణతో, శారీరక దృఢత్వంతో తీర్చిదిద్ది జాతీయ విజేతలుగా నిలిపిన శిక్షకుడు సి .రెడ్డి కుమార్ కృషిని చైర్మన్ అతావుల్లా ఖాన్ ప్రత్యేకంగా కొనియాడారు. అలాగే, కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడల పట్ల పిల్లలకు ధ్యాస చూపి, వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ పతకాలు సాధ్యమయ్యాయని తెలుపుతూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా క్రీడలకు పాఠశాల యాజమాన్యం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *