మన ధ్యాస, మక్తల్: బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల రాఘవేంద్ర ముదిరాజ్, జిల్లా కన్వీనర్ రాజశేఖర్ అడ్వకేట్ ముదిరాజ్, కో కన్వీనర్ బలిజ వీరేశ్… పండుగ సాయన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఆయన ఘనతను వివరించారు. పేదల పాలిట పెన్నిధి అని, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు ఈశ్వర్ గువ్వల శివరాజ్ ,పొర్ల డేవిడ్, ట్రెజరరీ కృష్ణ మాదిగ, జాగృతి జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మహారాజ్ ప్రవీణ్ శ్రీనివాస్ విజయ్ మహారాజ్ నరేష్ ముదిరాజ్ వేణు రాజు పెద్దింటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.